రావి ఆకుపై వినూత్న సందేశం-ఓటరు మహాశయా ఆలోచించి ఓటు వేయవయ్యా! - ఓటరు అవగాహన కార్యక్రమం
Published : Nov 28, 2023, 8:05 PM IST
Leaf Art Vote Symbol For Voter Awareness :ఓటర్లను చైతన్యవంతం చేసేందుకు సంగారెడ్డి జిల్లాకి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ వినూత్న రీతిలో సందేశమిచ్చారు. ఓటరు మహాశయా ఆలోచించి ఓటు వేయి.. నువ్వు ఓటు వేసి గెలిపించే వారిదే ఐదు సంవత్సరాలు అధికారం. అనాలోచితంగా ఓటు వేసి అందరి బ్రతుకులు అంధకారం చేయకు అని నారాయణఖేడ్‌కి చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ రావి ఆకుపై చిత్రాన్ని గీసారు. ప్రధానంగా ఆకు మీద ఓటు చిహ్నం, బ్యాలెట్, ఈసీ ముద్ర ఇలా వివిధ చిత్రాలతో ఎంతో చూడముచ్చటగా చిహ్నాన్ని శివకుమార్ రూపొందించారు.
తమ పిల్లల భవిష్యత్తుకు ఓటు ఎంతో అవసరమని.. డబ్బులకు, ఇతర ప్రలోభాలకు లొంగకుండా.. ఓటును దుర్వినియోగం చేసుకోకండి అంటూ చిత్రం ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ఓటు మన చేతిలో ఉన్న అద్భుతమైన వరమని.. దీనిని ప్రతి పౌరుడు ఆయుధంగా ఉపయోగించుకోవాలని చిత్రం ద్వారా చాటిచెప్పారు. అదే మన భవిష్యత్తుకు పునాదని.. ఆలోచించి మంచి ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలని ప్రజలకు తన ప్రతిభ ద్వారా వినూత్న సందేశమిచ్చారు.