తెలంగాణ

telangana

Laxman Fires on BRS and Congress

ETV Bharat / videos

'వేలంపాట మాదిరిగా బీఆర్ఎస్, కాంగ్రెస్​లు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారు' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023

By ETV Bharat Telangana Team

Published : Nov 5, 2023, 7:16 PM IST

Laxman Fires on BRS and Congress : బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు వేలంపాట మాదిరిగా ఉచిత పథకాలు ప్రకటిస్తున్నాయని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌(BJP MP Laxman) అన్నారు. కర్ణాటక ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో ఆంక్షలు పెడుతుందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వమే మేలనే అభిప్రాయానికి కర్ణాటక ప్రజలు వచ్చేశారని పేర్కొన్నారు. ఉచిత హామీలతో మోసపోయామని కర్ణాటక ప్రజలు గుర్తించారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆరు నెలల్లోనే కాంగ్రెస్ మాట మార్చిందని మండిపడ్డారు. 

BJP MP Laxman Comments on Congress : కర్ణాటకలో 65 ఏళ్లు దాటిన వారికే వృద్యాప్య పింఛన్లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. చేయూత పథకాల పేరుతో చెయ్యి ఇస్తారు జాగ్రత్తని ప్రజలను హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ హామీలకు మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. అలాగే హైదరాబాద్​లో ఈ నెల 7న ప్రధాని మోదీ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనసేన ఎన్డీఏ భాగస్వామి అన్న లక్ష్మణ్‌.. జనసేనతో పొత్తు ఖరారు అయ్యిందని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాల్లో జనసేనతో కలిసిపోతామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details