కశ్మీర్లో కుంగుతున్న భూమి.. ఎక్కడికక్కడ నేలకు పగుళ్లు.. అనేక ఇళ్లు ధ్వంసం - వైరల్ వీడియోలు
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. గోల్ పంచాయత్‌లోని దిక్సర్ ప్రాంతంలో ఉదయం ఐదు గంటల నుంచి భూమి అనూహ్యంగా కుంగడం ప్రారంభించింది. దీంతో ఇప్పటికే 10 ఇళ్లు పూర్తిగా నేలమట్టం అయ్యాయి. మరిన్ని ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. అక్కడి నుంచి ఆస్తులను వేరే చోటుకు తరలిస్తున్నారు. తమ ఇళ్లు ధ్వంసం కావడంపై పలువురు స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. సహాయక బృందాలను ఘటనా స్థలానికి పంపించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.