lalu prasad yadav reached delhi from singapore
మూడు నెలల తర్వాత భారత్‌కు చేరుకున్న లాలూ.. అభిమానులకు అభివాదం చేస్తూ.. - లాలూ ప్రసాద్ లేటెస్ట్ న్యూస్
ఆర్జేడీ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ దాదాపు మూడు నెలల తర్వాత స్వదేశానికి చేరుకున్నారు. దిల్లీలోని విమానాశ్రయంలో ఆయనను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు ఎగబడ్డారు. ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ కారు ఎక్కారు. ఆయన కిడ్ని మార్పిడి కోసం గతేడాది డిసెంబరులో సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రికి వెళ్లారు. లాలూకు ఆయన కుమార్తె రోహిణి ఆచార్య కిడ్నీని దానం చేశారు.
Last Updated : Feb 14, 2023, 11:34 AM IST