Yaddari Temple: యాదాద్రీశునికి ఘనంగా లక్ష పుష్పార్చన మహోత్సవం - Pujas at Yadadri Temple
Yadadri Sri Lakshmi Narasimha Swamy Temple: ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామీ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఘనంగా లక్ష పుష్పార్చన క్యార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు సుమారు గంట పాటు, ప్రధాన ఆలయంలోని ఆలయ ముఖమండపంలో లక్ష పుష్పార్చన పూజలు, పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం చేపట్టారు. వేదపండితుల మంత్రోచ్ఛారణ చేత, సన్నాయి మేళం నడుమ ఆలయ సంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు లక్ష పుష్పార్చన కార్యక్రమ విశిష్టతను వివరించారు.
మరోవైపు ఆలయంలో భక్తుల రద్ధీ అధికంగా ఉంది. ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దీంతో ఉచిత దర్శనానికి దాదాపు రెండు నుంచి మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంట నుంచి గంటన్నర సమయం పట్టింది. లడ్డు ప్రసాదం కౌంటర్లు, నిత్యా కళ్యాణం, పుష్కరిణి, వాహనాల పార్కింగ్ వద్ద భక్తుల సందడి నెలకొంది.