Kunamneni:'ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయాలు చెల్లవు' - ఖమ్మం జిల్లా తాజా వార్తలు
Kunamneni Sambasiva rao Fires on BJP: వ్యవస్థల్ని గుప్పెట్లో పెట్టుకొని దేశమంతా గుజరాత్ మోడల్ అరాచకాలు అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. దేశానికి బీజేపీ క్యాన్సర్ గడ్డలా తయారయ్యిందని విమర్శించారు. దాన్ని పూర్తిగా నాశనం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని, రాష్ట్రంలోని ప్రగతిశీల శక్తులన్నింటినీ ఏకం చేయాలని సూచించారు. ఖమ్మం జిల్లాలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ధన రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కూనంనేని సాంబశివరావు ఆరోపించారు. చైతన్యవంతమైన ఖమ్మం జిల్లాలో పొంగులేటి రాజకీయాలు చెల్లవని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులతో పెట్టుకుంటే తనకే నష్టమని హెచ్చరించారు. రాష్ట్రంలో సంచలనం అవుతున్న పేపర్ లీకేజీ కేసులో నిందితుడైన ప్రశాంత్ జైలు నుంచి విడుదల అయితే బీజేపీ నాయకులు సన్మానం చేశారని విమర్శించారు. ఇలాంటి చర్యలు దేనికి సంకేతమని ప్రశ్నించారు. దేశానికి బీజేపీకి క్యాన్సర్ వంటిదని ఆయన దుయ్యబట్టారు.