నదిలో దూకి బాలిక ఆత్మహత్యాయత్నం.. రాళ్ల మధ్యలో చిక్కుకొని.. - నదిలో చిక్కుకున్న బాలిక హిమాచల్‌ప్రదేశ్
GIRL TRAPPED IN BEAS RIVER: హిమాచల్‌ప్రదేశ్ మనాలీ వద్ద బియాస్ నదిలో చిక్కుకుపోయిన ఓ బాలికను కులూ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. నది మధ్యలో ముడుచుకొని కూర్చున్న బాలికను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. హుటాహుటిన వచ్చిన పోలీసు సిబ్బంది.. అగ్నిమాపక శాఖ సాయంతో బాలికను రక్షించారు. బాలిక ఆత్మహత్య చేసుకోవాలని భావించి నదిలో దూకినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వేరే ప్రాంతంలో నదిలో దూకిన బాలిక.. ప్రవాహానికి కొట్టుకొచ్చి ఆగినట్లు తెలుస్తోంది.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST