రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మంచివి కాదు : కేటీఆర్ - కేటీఆర్
Published : Jan 14, 2024, 9:19 PM IST
KTR visited Family of Murdered BRS Activist in Nagarkurnool : గతంలో రాష్ట్రంలో ఇలాంటి హింసాయుత వాతవరణం లేదని, ఇలాంటి పరిస్థితి మంచిది కాదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. నాగర్‌కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లిలో ఇటీవల హత్యకు గురైన మల్లేశ్ కుటుంబాన్ని మాజీ మంత్రులు నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లతో కలిసి పరామర్శించారు. హత్యకు గురైన మల్లేశ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, బీఆర్ఎస్ పార్టీ తరపున రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించారు.
KTR in Nagarkurnool : బాధిత మల్లేశ్ కుటుంబానికి అన్నివేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో హత్యా రాజకీయాలు మంచివి కాదని, కార్యకర్తలపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు. కింది స్థాయి కార్యకర్తలను సమిధలను చేయడం భావ్యం కాదన్నారు. ఇలాంటి ఘటనలు కొనసాగకుండా స్థానిక ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలన్నారు. మల్లేశ్ హత్యపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని డీజీపీ, ఎస్పీని కోరారు.