KTR tweet on Foxconn plant : తెలంగాణ స్పీడ్.. ఫాక్స్‌కాన్ ప్లాంట్ నిర్మాణ పనులపై కేటీఆర్ ట్వీట్ - KTR
KTR tweet on Foxconn plant : తెలంగాణలోని కొంగర కలాన్‌లో నిర్మిస్తున్న ఫాక్స్‌కాన్ ప్లాంట్‌పై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేవలం ఒక నెల క్రితం భూమి పూజ చేసిన ఫాక్స్‌కాన్ ప్లాంట్‌కు ఇప్పుడు ఈ దశలో ఉంది అంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్లో వీడియో పోస్ట్ చేశారు. ఈ ప్రాజెక్టు చురుకైన పురోగతి అందుకోవడం పట్ల కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఫాక్స్‌కాన్ ఛైర్మన్ మిస్టర్ యంగ్ లి యూ సూచించిన తెలంగాణ స్పీడ్ అన్న మాటలను.. వారి బృందం బాగా అవలంభిస్తోందన్నారు. తక్కువ సమయంలో అభివృద్ధి చెందుతున్న ఫాక్స్‌కాన్ ప్లాంట్‌పై మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ప్రశంసించారు.
రంగారెడ్డి జిల్లా కొంగర్‌కలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థ ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులకు పెట్టేందుకు ముందుకొచ్చింది. రూ.1,655 కోట్ల పెట్టుబడితో ఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం 196 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ పరిశ్రమ ఏర్పాటు ద్వారా 35,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటుచేయనున్నారు.