ktr: గిరిజన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సీఎమ్ఎస్టీఈఐ యూనిట్ల పంపిణీ
KTR distributed checks to tribal aspiring entrepreneurs: ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయకుండా ప్రయాణం ముందుకు సాగిస్తూ.. వ్యవస్థాపకులుగా పైకి ఎదగాలని గిరిజన ప్రజలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు. దేశీయ, స్థానిక పారిశ్రామికవేత్తల అభివృద్ధికి సానుకూల వాతావరణం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన సీఎంఎస్‌టి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ స్కీంలో భాగంగా నేడు హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో గిరిజనుల కోసం రూ.28.59 కోట్లు విలువైన యూనిట్లు మంజూరు చేశారు.
ఇప్పటి వరకు 300మంది గిరిజను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు నైపుణ్య శిక్షణ పొందినట్లు తెలిపారు. నేడు 24 మంది గిరిజన పారిశ్రామిక వేత్తలకు 28.59 కోట్ల విలువైన యూనిట్లు మంజూరు చేయగా...వాటిలో 9.85 కోట్ల సబ్సిడీ రూపంలో మంజూరు చేశారు. దేశంలో ఉన్న గిరిజన యువత తల్చుకుంటే ఏదైనా సాధించవచ్చని.. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించేది వారే అని మంత్రి కేటిఆర్ గిరిజన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. కులమతాలు అన్న భేదాలు సృష్టించుకున్నది మనుషులే కానీ.. అందరూ ఒక్కటే అని అందరం గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, హోం శాఖ మంత్రి మెుహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు.