KTR Boat Driving in Madhyamaneru Reservoir : మధ్యమానేరులో కేటీఆర్ బోట్ రైడ్.. డ్రైవింగ్ మాములుగా లేదుగా..
KTR Boat Driving in Madhyamaneru Reservoir Rajanna Siricilla : మధ్యమానేరు జలాశయంలో మంత్రి కేటీఆర్ అమెరికన్ ప్లాటూన్ డీలక్స్ బోట్ నడిపి అందరిని ఆశ్చర్యపరిచారు. రాజన్నసిరిసిల్ల జిల్లాలో (Rajanna Siricilla) రూ.3 కోట్ల 16లక్షలతో కొత్తగా ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్‌ను.. పర్యాటక శాఖమంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మధ్యమానేరు జలాశయ అందాన్ని వీక్షిద్దామంటూ.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు కలెక్టర్ అనురాగ్ జయంతి, ఎస్పీ అఖిల్ మహాజన్‌లను తన బోటులోకి ఎక్కించుకొని చక్కర్లు కొట్టారు. బోటింగ్ యూనిట్‌లో 120మంది ఒకేసారి ప్రయాణించేలా డబుల్ డెక్కర్ ఏసీ క్రూయిజ్ బోట్.. 20మంది ప్రయాణించేలా అమెరికన్ ప్లాటూన్ డీలక్స్‌తో పాటు నలుగురు ప్రయాణించేలా స్పీడ్ బోటులు ఉన్నాయి. మంత్రి కేటీఆర్‌తో పాటు అందరు లైఫ్ జాకెట్లతో సరదాగా మధ్యమానేరులో షికారు చేశారు. ఈ కార్యక్రమం అనంతర సభలో మాట్లాడిన కేటీఆర్.. సిరిసిల్లతో పాటు జిల్లా మండల కేంద్రాల్లోనూ నీరా కేఫ్‌లు (Neera Cafe) ఏర్పాటు చేయాలని శ్రీనివాస్ గౌడ్‌ను కోరుతున్నానని చెప్పారు.