KTR at Mega Property Show in Hyderabad : 'నగరాభివృద్ధికి ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా' - హైదరాబాద్ తాజా వార్తలు
Published : Sep 9, 2023, 1:45 PM IST
KTR at Mega Property Show in Hyderabad : ప్రభుత్వాలు, పాలకులు సరైన ప్రణాళికలతో ముందుకు వెళితే ఆయా నగరాలు అద్భుతంగా అభివృద్ది చెందుతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్ దార్శనికతతో కృష్ణా, గోదావరి నుంచి వందల కిలోమీటర్ల నుంచి నీటిని తీసుకువచ్చి హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీరుస్తున్నామని వెల్లడించారు. హైటెక్స్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు.
KTR On Hyderabad Development :ప్రభుత్వం నిర్మించిన భారీ ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్ నగరానికి తాగునీటి అవసరాల కోసం ప్రత్యేకంగా నీటిని కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ప్రముఖ అంతర్జాతీయ ప్రఖ్యాతి కలిగిన రియేల్ ఎస్టేట్ సంస్థలు కూడా నగరాభివృద్దిని ప్రత్యేకంగా తమ నివేదికలో పేర్కొంటున్నాయని అన్నారు. రియల్ ఎస్టేట్ అంటే కేవంలం అమ్మకం కొనుగోలు మాత్రమే కాదని...ఈ రంగంపై రాష్ట్రంలో 30లక్షల మంది ఆధారపడి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఇప్పటి దాకా జరిగిన అభివృద్ది ట్రైలర్ మాత్రమే.. ఇంకా అనేకమైన ప్రాజెక్టులతో గొప్ప విజన్‌తో చేసే అసలు సినిమా ముందుందని తెలిపారు. వినూత్నమైన ఆకృతులతో అద్భుతమైన భవనాలను నిర్మాణం చేయాలని రియల్ ఎస్టేట్ సంస్థలను కోరారు.