మెకానిక్లా వచ్చి ఆర్టీసీ బస్సు చోరీ.. సీసీటీవీ దృశ్యాలు వైరల్ - కేరళ ఆర్టీసీ బస్సు దొంగతనం
KSRTC Bus stolen: ఆర్టీసీ బస్టాండ్ నుంచే బస్సును చోరీ చేశాడు ఓ వ్యక్తి. కేరళ ఎర్నాకులంలోని అలువ ప్రాంతంలో ఉదయం 8.20కి జరిగిందీ ఘటన. సీసీటీవీలో ఈ దృశ్యాలు నమోదయ్యాయి. మెకానిక్ వేషంలో వచ్చిన దొంగ.. అలువ నుంచి కోజికోడ్ వెళ్లాల్సిన బస్సును చోరీ చేసుకొని వెళ్లాడు. దారిలో ఓ వాహనాన్ని ఢీకొట్టాడు నిందితుడు. ప్రమాదం గురించి సమాచారం గురించి తెలుసుకున్న పోలీసులు.. ఆరా తీయగా బస్సు చోరీ విషయం బయటపడింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడికి మానసిక సమస్యలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. బస్సును చెకింగ్ కోసం మెకానిక్ తీసుకెళ్తున్నాడని అక్కడి ఉద్యోగులు భావించడం ఆశ్చర్యం!!
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST