తెలంగాణ

telangana

Kondamuchu Security in Vinayaka Mandapam Kesamudram

ETV Bharat / videos

Kondamuchu Security in Vinayaka Mandapam Kesamudram : కొండెంగ పహారాలో గణనాథుని నవరాత్రి వేడుకలు

By ETV Bharat Telangana Team

Published : Sep 21, 2023, 6:52 PM IST

Kondamuchu Security in Vinayaka Mandapam Kesamudram :విఘ్నాలను తొలగించే గణనాథుని పూజకు వానరాలు అడ్డంకిగా మారాయి. కోతులు బెడద అధికంగా ఉండడంతో భక్తులకు, పూజసామాగ్రి రక్షణ కోసం మండపం నిర్వాహకులు కొండముచ్చును ఏర్పాటు చేసుకున్న సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఆదిదేవా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపం వద్ద నిర్వాహకులు కొండెంగ పహారాలో గణేశ్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

కల్వల గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్ అనే రైతు వద్ద ఉన్న కొండెంగను నిర్వాహకులు తీసుకువచ్చి.. మండపం దగ్గర కాపాలగా ఉంచారు. దీంతో కోతులు మండపంలో అడుగు కూడా పెట్టడం లేదు. గణపతి దర్శనానికి వచ్చే భక్తులు కొండెంగను విచిత్రంగా చూస్తున్నారు. కమిటీ నిర్వాహకులు శ్రీను మాట్లాడుతూ..  ఆదిదేవా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 42 సంవత్సరాలుగా వినాయక నవరాత్రి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దీనిలో 500 మంది సభ్యులుగా ఉన్నామని.. మధ్యాహ్నం 1000 మందికి నిత్య అన్నదానం చేస్తున్నామన్నారు. రాత్రి పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు, అల్పాహారం కూడా పెడుతున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details