తెలంగాణ

telangana

Komuravelli Mallanna Kalyanam 2024

ETV Bharat / videos

ఘనంగా కొమురవెళ్లి మల్లన్న కల్యాణోత్సవం - ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పణ - కొమురవెల్లి మల్లికార్జున

By ETV Bharat Telangana Team

Published : Jan 7, 2024, 3:32 PM IST

Komuravelli Mallikarjuna Swamy Kalyanam in Siddipet: సిద్దిపేట జిల్లాలో కొలువుదీరిన కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కల్యాణం కన్నుల పండువగా జరిగింది. కల్యాణోత్సవంలో భాగంగా ఆలయంలో దృష్టి కుంభం కార్యక్రమం పూర్తయింది. ఉజ్జయిని పీఠాధిపతి పర్యవేక్షణలో వేద పండితులు, పురోహితులు వివాహ తంతును నిర్వహించారు. మల్లికార్జున స్వామికి మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.

Komuravelli Mallanna Kalyanam 2024: ప్రభుత్వం తరఫున మంత్రులు మల్లికార్జున స్వామివారికి, ఇరువురు అమ్మవార్లకు కట్నాలు, బంగారు కిరీటాలు అందజేశారు. ఇరువురు అమ్మవార్లకు మళ్లీ కల్యాణం వరకు బంగారు కిరీటాలు ప్రభుత్వం తరఫున చేయిస్తామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. స్వామివారి కల్యాణం(Komuravelli Mallikarjuna Swamy Kalyanam) తిలకించేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. కల్యాణోత్సవం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ప్రశాంతంగా కల్యాణం చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details