తెలంగాణ

telangana

Komatireddy Rajagopal Reddy

ETV Bharat / videos

తుంగతుర్తి నియోజకవర్గానికి పంచ పాండవుల్లాగా అండగా ఉంటాం : రాజగోపాల్​ రెడ్డి - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2023, 10:42 PM IST

Komatireddy Rajagopal Reddy Election Campaign in Thungathurthy :సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి.. తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మందుల సామేలుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తుంగతుర్తి నియోజకవర్గానికి పంచ పాండవుల్లాగా అండగా ఉంటామని.. అవసమైతే ప్రాణాలైనా ఇచ్చి కాపాకుంటామని పేర్కొన్నారు. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, నకిరేకల్​లో వేముల వీరేశం, నల్లగొండలో వెంకట్​రెడ్డి, తుంగతుర్తిలో సామేలు, రాజగోపాల్ రెడ్డిలు అండగా ఉంటామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మందుల సామేలును గెలుపించుకునే భాధ్యత నియోజకవర్గ ప్రజలపైనే ఉందని అందుకోసం ప్రతి కార్యకర్త  యుద్ధంలోని సైనికుల్లా పనిచేయాలని సూచించారు.

Congress Focus on Telangana Assembly Elections :మరోవైపు రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. ఏ అవకాశాన్ని జారవిడుచుకోకుండా ముందుకు వెళ్తోంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో.. అభ్యర్థులంతా ప్రచారంలో తలమునకలై ఉన్నారు. పార్టీకి సానుకూల వాతావరణం ఉన్నట్లు చెబుతున్న హస్తం పార్టీ.. అధికార బీఆర్‌ఎస్‌, బీజేపీని ఎదుర్కొనేందుకు మరింత పటిష్ఠంగా ముందుకు వెళ్లేందుకు వ్యూహాలు రచిస్తోంది. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details