తెలంగాణ

telangana

Venkat Reddy Comments on Congress MLA Tickets 2023

ETV Bharat / videos

Komatireddy Venkat Reddy on Congress MLA Tickets : నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధం: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - వచ్చే ఎన్నికల్లో పోటీపై వెంకట్‌రెడ్డి కామెంట్స్

By ETV Bharat Telangana Team

Published : Aug 29, 2023, 7:36 PM IST

Komatireddy Venkat Reddy Comments on Congress MLA Tickets 2023 : బీసీల కోసం నల్గొండ సీటును త్యాగం చేయడానికి సిద్ధమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తన నియోజకవర్గంలో 6 దరఖాస్తులు వచ్చాయని.. అందరి బలాబలాలు పరిశీలిస్తామని తెలిపారు. సమర్థవంతమైన వాళ్లకే టికెట్లు ఇస్తామని పేర్కొన్నారు. పీఈసీ సభ్యులతో ఏఐసీసీ వన్ టూ వన్ మాట్లాడాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రతిపాదించారని.. ఆ ప్రతిపాదనను అందరం ఆమోదించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఎన్నికల ముందు మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఏదో మతలబు ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆర్ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.

ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్‌ ఈసారి దరఖాస్తులను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. రేవంత్‌రెడ్డి నియోజకవర్గం మినహా మిగతా అన్ని నియోజకవర్గాలకు ఒకటికి మించి దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా వెయ్యి మందికి పైగా ఎమ్మెల్యే టికెట్‌ కోసం అప్లికేషన్‌లు సమర్పించారు. నేటి నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details