Komati Reddy Rajagopal Reddy Comments on CM KCR : '100 మంది కేసీఆర్లు వచ్చినా.. ఈసారి కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరు' - తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023
Published : Oct 28, 2023, 9:34 PM IST
Komati Reddy Rajagopal Reddy Comments on CM KCR : వంద మంది కేసీఆర్లు అడ్డొచ్చినా.. తెలంగాణలో కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరని మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కచ్చితంగా రాష్ట్రంలో 80 సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచి.. అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ గడ్డపై కేసీఆర్ కుటుంబ పాలనను ఓడించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. దిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి శంషాబాద్ విమాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, కోమటిరెడ్డి అభిమానులు ఘన స్వాగతం పలికారు.
తెలంగాణలో 80 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. సోనియాగాంధీకి కానుకగా ఇస్తామని పేర్కొన్నారు. 'రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ గాలి జోరుగా వీస్తోంది. ఆనాడు కేసీఆర్ను గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీ వైపు అడుగులు వేశాను. కానీ ప్రజల్లో బీజేపీ తన బలాన్ని కోల్పోయింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా.. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి' అని అన్నారు.