తెలంగాణ

telangana

Polithin covers Cover on Komaram Bheem project

ETV Bharat / videos

Polithin covers on Komaram Bheem project : కొమరం భీం ప్రాజెక్ట్‌పై పాలిథిన్‌ కవర్లు.. నిర్లక్ష్యం ప్రాణాంతకం కానుందా?

By

Published : Jul 21, 2023, 7:16 PM IST

Komaram Bheem project Issue: కుమురం భీం ఆసిఫిబాద్‌ జిల్లాలో గత సంవత్సరం వర్షాలకి దెబ్బతిన్న కొమరం భీం ప్రాజెక్ట్‌.. ప్రస్తుతం దిగువ ప్రాంత ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. సంవత్సరం క్రితం కురిసిన వర్షాలు వల్ల ఆ ప్రాజెక్ట్‌ సైడ్‌ వాలు దెబ్బతిని విరిగిపోయింది. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఆనకట్ట పగుళ్లు బయటకి కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆనకట్టను కాపాడుకునేందుకు ఇంజినీరింగ్‌ అధికారులు నీటి తాకిడిని తట్టుకునేలా పాలిథిన్‌ కవర్లను అమర్చారు. ప్రస్తుతం పై నుంచి వరద నీరు పోటు ఎత్తడంతో ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదులుతున్నారు. వరద నీటిని లెక్కించేందుకు డైల్గేజ్ లేకపోవడంతో నీటిమట్టాన్ని అధికారులు లెక్కించలేక పోతున్నారు. ప్రాజెక్టు దెబ్బతిని సంవత్సరం అయినప్పటికి ఎలాంటి చర్యలు చేయనందున.. ఆ ప్రభావం ప్రస్తుతం ప్రమాదకరంగా మారుతుంది. ప్రాజెక్ట్‌ పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిపోయింది. ఎప్పుడు ఆనకట్ట తెగిపోతుందో అనే అయోమయంలో ప్రజలు భయపడుతున్నారు. ఈ వర్షాకాలంలో కూడా పాలిథిన్‌ కవర్లతో అలాగే ఉంచడంపై స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details