Kodi Katthi Case Trial Adjourned: కోడి కత్తి కేసు విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేసిన ఎన్‌ఐఏ-ఏడీజే కోర్టు - Kodi Katthi Case Trial news
Published : Sep 29, 2023, 3:36 PM IST
Kodi Katthi Case Trial Adjourned:విశాఖపట్నంలోని ఎన్‌ఐఏ-ఏడీజే కోర్టులో నేడు కోడి కత్తి కేసుపై విచారణ జరిగింది. విచారణలో భాగంగా న్యాయవాదుల వాదోపవాదాలను విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను వచ్చే నెల 13కి వాయిదా వేసింది. విచారణ నిమిత్తం నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు.
Advocate Salim Comments:కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం.. గత విచారణ (సెప్టెంబర్ 20)లో మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ కచ్చితంగా కోర్టుకు హాజరుకావాలన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో ఘటన జరిగిన రోజున వైఎస్సార్సీపీ నాయకులపై కూడా కేసు నమోదైందని గుర్తు చేశారు. కానీ, ఆ కేసుపై కోర్టులో విచారణ జరగటం లేదని వాపోయారు. న్యాయవాదిగా.. వైసీపీ నాయకులపై నమోదైన కేసుపై కూడా కోర్టులో విచారణ జరగాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ కోర్టుకు హాజరు కాలేని పక్షంలో ఎన్‌వోసీ ఇవ్వాలని కోరారు. శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరానన్న న్యాయవాది సలీం.. ప్రతివాదిగా ఉన్న సీఎం జగన్ నేరుగా కోర్టుకు హాజరు కాలేకపోతే.. వీడియో మోడ్ ద్వారా విచారించాలని కోర్టుకు అభ్యర్థించినట్లు వెల్లడించారు.