కేసీఆర్ అణిచివేత వల్లే తెలంగాణ ప్రజలు ఒక్కటయ్యారు : ప్రొ. కోదండరాం - సచివాలయం ఉద్యోగులతో కోదండరాం
Published : Dec 6, 2023, 5:02 PM IST
Kodandaram speech to Telangana Secretariat Employees : ఉద్యోగ సంఘ నేతలతోనే ఉద్యోగుల హక్కులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం హరించిందని ప్రొ. కోదండరాం ఆవేదన చెందారు. కొత్త ప్రభుత్వంలో ప్రజాస్వామిక పాలన ఉంటుందని అన్నారు. తాను ప్రభుత్వం, ఉద్యోగులకు వారధిగా ఉంటానని ఈ సందర్భంగా చెప్పారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన అనంతరం కోదండరాం మాట్లాడారు.
గత ప్రభుత్వం మీద ఆగ్రహం ఎంత ఉందో అన్నది స్పష్టంగా అర్థమవుతోందని ప్రొ. కోదండరాం అన్నారు. ఇంతటి కోపం కలుగుతుందంటే అర్థమేంటి ఈ తొమ్మిదన్నరేళ్ల సంవత్సరాలు అణిచివేత ఏ విధంగా ఉందో అర్థమవుతోందని అన్నారు. అరాచక పాలన, నిరంతరం నిఘా, నియంతృత్వ పోకడలు ఇవి మన ఆగ్రహానికి ప్రధాన కారణమని తెలిపారు.
ఇలాంటి అణచివేత ఉండబట్టే తెలంగాణ ప్రజలు ఒక్కటై కేసీఆర్ని ఓడించారని కోదండరాం పేర్కొన్నారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ సెక్రటేరియట్ వరకు ఒకే రకమైన వాతావరణం ఉందన్నారు. సంఘాలు అనేవి మన మీద జూలు విదల్చడానికి ఉండకూడదు. అవి మన హక్కులను, మనల్ని సంరక్షించేవిగా ఉండాలని కోదండరామ్ తెలిపారు.