తెలంగాణ

telangana

Kodandaram launches TNGOS Hyderabad Sports Meet

ETV Bharat / videos

ఉద్యోగులంతా సమర్ధంగా పనిచేస్తేనే ప్రభుత్వానికి మంచిపేరు : కోదండరాం - Prof Kodandaram on TNGO

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 7:19 PM IST

Kodandaram launches TNGOS Hyderabad Sports Meet :ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరడంలో అధికారుల, ఉద్యోగుల పాత్ర కీలకమని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పునరుద్ఘాటించారు. నగరంలోని ఎల్బీ స్టేడియంలో టీఎన్జీవోఎస్(TNGOS) తొమ్మిదో​ హైద్రాబాద్ జిల్లా స్పోర్ట్స్‌ మీట్‌ను టీఎన్జీవోఎస్ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్‌తో కలిసి ఆచార్య కోదండరాం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడారు.

TNGOS Hyderabad Sports Meet at LB Stadium :ఉద్యోగులు సమర్థంగా పని చేస్తేనే ప్రభుత్వ పథకాలు పేదలకు అందుతాయని, తద్వారా సర్కారుకు మంచిపేరు వస్తుందని కోదండరాం అన్నారు. నాలుగు గోడల మధ్య అనునిత్యం ఒత్తిడితో పనిచేసే ఉద్యోగులకు ఈ క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కోదండరామ్ పేర్కొన్నారు. ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ క్రమంలో టీఎన్జీవోఎస్ హైదరాబాద్​ జిల్లా స్పోర్ట్​ మీట్​ను గత తొమ్మిదేళ్లుగా జరుపుతున్నారని ఆ సంఘం అభ్యర్థులను అభినందించారు.  

ABOUT THE AUTHOR

...view details