తెలంగాణ

telangana

kishanreddy

ETV Bharat / videos

kishanreddy Visit Flood Affected Areas : 'వరద పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వలేదు' - Union Minister KishanReddy Latest News

By

Published : Jul 30, 2023, 10:22 PM IST

kishanreddy Visit Flood Affected Areas in Warangal : వరంగల్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పర్యటించారు. నగరంలోని పోతననగర్, రామన్నపేట, ఎస్ఆర్‌నగర్, బీఆర్‌నగర్‌ కాలనీలో పర్యటించి.. వరద బాధితులకు నిత్యవసర సరకులు, దుప్పట్లను అందజేశారు. కేంద్ర బృందాలు రేపటి నుంచి వరద నష్టం వివరాలు సేకరిస్తాయని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే పది విపత్తు బృందాలు అందుబాటులో ఉన్నాయని ఆయన వివరించారు.

ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం వరద కారణంగా ఎంత నష్టం జరిగిందో .. కేంద్రానికి నివేదిక ఇవ్వలేదని కిషన్‌రెడ్డి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో.. తెలంగాణ బీజేపీ నాయకుల కోరిక మేరకు రాష్ట్రానికి కేంద్ర విపత్తు బృందాలు వచ్చాయని అన్నారు. ఈ క్రమంలోనే వరద తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వద్ద రూ.900 కోట్లకు పైగా కోట్లు ఉన్నాయని.. వాటిని వినియోగించుకోవాలని సూచించారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. ఇందులో కేంద్రం రూ.3 లక్షలు, రాష్ట్రం రూ.లక్ష ఇస్తుందని చెప్పారు. అనంతరం కిషన్‌రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు ప్రయాణమయ్యారు

ABOUT THE AUTHOR

...view details