తెలంగాణ

telangana

KishanReddy

ETV Bharat / videos

KishanReddy Respond to Change of BJP President : 'తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదు' - Kishan Reddy latest news

By

Published : May 21, 2023, 3:32 PM IST

KishanReddy Respond to Change Telangana BJP President : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పునకు అవకాశమే లేదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి స్పష్టంచేశారు. అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలు.. నిరాధారమైనవని మీడియాతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో తెలిపారు. పార్టీ ఓ కుటుంబంలాంటిదని.. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సహజం అన్నారు. కవిత అరెస్ట్ సీబీఐ పరిధిలోని అంశం అని పేర్కొన్నారు.. ఆధారాలుండబట్టే దిల్లీ ఉప ముఖ్యమంత్రిని సీబీఐ అరెస్ట్ చేసిందని వివరించారు. అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలను సైతం జైలుకు పంపించామని గుర్తు చేశారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్​ను.. ఎంఐఎం నడిపిస్తోందని ఆరోపించారు. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే సంబుర పడుతున్నారని ఎద్దేవా చేశారు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. నోట్ల రద్దులో తమ ప్రణాళిక తమకు ఉందని వెల్లడించారు. కర్ణాటక ఎన్నికల‌ ప్రభావం తెలంగాణలో ఉండదని స్పష్టం చేసిన కిషన్​రెడ్డి.. కాంగ్రెస్​కు రాష్ట్రంలో భవిష్యత్ లేదని భారత్​ రాష్ట్ర సమితికి.. బీజేపీనే ప్రత్యామ్నాయమని వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details