తెలంగాణ

telangana

kishan reddy

ETV Bharat / videos

Kishanreddy at Lashkar Bonalu 2023 : 'అమ్మవారి ఆశీస్సులతో.. త్వరలో రాష్ట్రంలో మంచి పాలన' - ఉజ్జయిని మహంకాళి బోనాలు

By

Published : Jul 9, 2023, 11:10 AM IST

Kishan Reddy On Ujjain Mahankali Bonalu 2023 : సికింద్రాబాద్‌ బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. ఉదయం కుటుంబ సమేతంగా కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్​రెడ్డి మహంకాళి అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్​రెడ్డి... తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా త్వరలో అమ్మవారి ఆశీసులతో మంచి పరిపాలన వస్తుందని వ్యాఖ్యానించారు. ఎలాంటి ప్రకృతి విపత్తులు లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్ధించామన్నారు. మంచి పాలన దేశ వ్యాప్తంగా ఉండాలని కోరినట్లు కిషన్‌ రెడ్డి తెలిపారు.

'గత వందలాది సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తున్నటువంటి ఆషాఢ మాసం సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు పండుగ అత్యంత వైభవంగా జరుగుతోంది. ఒక్క హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నుంచే కాకుండా చుట్టు పక్కల ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. మహిళలు ఇళ్లలో మహంకాళి అమ్మవారిని అలంకరించి.. బోనాలు తలమీద పెట్టుకొని.. ఇంతో భక్తి శ్రద్ధలతో బోనాల పండుగలో పాల్గొంటారు. మంచిగా వర్షాలు కురవాలి.. పాడి పంటలు పండాలని' కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి కోరారు.

ABOUT THE AUTHOR

...view details