Kishan Reddy Visited Medaram Sammakka Sarakka Temple : 'బీజేపీ అధికారంలోకి రాగానే.. గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తాం' - కిషన్‌రెడ్డి
Published : Oct 11, 2023, 2:27 PM IST
Kishan Reddy Visited Medaram Sammakka Sarakka Temple : బీజేపీ అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలుచేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన.. ముందుగా గిరిజన ఆరాధ్య దైవం గట్టమ్మ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారికి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గట్టమ్మ ఆలయ సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని కేంద్ర మంత్రి పరిశీలించారు. రూ.900 కోట్లతో కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పనున్నట్లు తెలిపారు.
అక్కడి నుంచి కిషన్‌రెడ్డి మేడారం బయలుదేరి వెళ్లారు. అనంతరం సమ్మక్క-సారాలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.. మోదీ నేతృత్వంలోని భారతదేశం మరింత అభివృద్ధి పథంలో సాగాలని ఆకాక్షించారు. ప్రపంచానికి భారత్‌ను విశ్వగురువుగా నిలిపే శక్తిని మోదీకి ఇవ్వాలని కోరుకుంటున్నానని మొక్కుకున్నానని తెలిపారు. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం పరిశీలన ఈటల రాజేందర్‌తో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.