Kishan Reddy Told to BJP Full Support RTC Bill : వేల ఎకరాల ఆర్టీసీ ఆస్తులపై ముఖ్యమంత్రి కుటుంబం కన్నేసింది : కిషన్ రెడ్డి - కేసీఆర్ పై కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు
Kishan Reddy reaction on RTC Bill : ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేందుకు బీజేపీ పూర్తి మద్దతు కార్మికులకే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నేడు నాంపల్లి రైల్వే స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆర్టీసీ బిల్లుపై స్పందించారు. బీజేపీ ఎల్లప్పుడూ ఆర్టీసీ కార్మికుల పక్షానే ఉంటుందన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో చట్టపరమైన అభిప్రాయాలు తీసుకోవలసిన అవసరం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. నిజంగా కార్మికుల మీద ప్రేమ ఉంటే.. ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు పెట్టుకోవచ్చు కదా అని ప్రభుత్వాన్ని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్పై ఘాటు విమర్శలు చేశారు. వేల ఎకరాల ఆర్టీసీ ఆస్తులపై ముఖ్యమంత్రి కుటుంబం కన్నేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏదో రకంగా భూములను అమ్ముకోవాలని చూస్తోందని విమర్శించారు. ఇన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడెందుకు కేసీఆర్కు ఆర్టీసీ కార్మికులపై ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ఆర్టీసీ బిల్లుపై బీఆర్ఎస్ పూర్తిగా రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.