Kishan Reddy Speech on National Handloom Day : 4 నెలల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక చేనేత సంఘాలకి ఎన్నికలు నిర్వహిస్తాం: కిషన్ రెడ్డి - జాతీయ చేనేత దినోత్సవం
Kishan Reddy Speech on National Handloom Day Stage : చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాక డబ్బులు ఇవ్వటం కాదు... వారు బతికివున్నప్పుడే ప్రోత్సాహకాలు ఇచ్చి వారి ఉపాధికి తోడ్పడాలని.. చేనేతకు సంబంధించి పథకాలను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా(అర్బన్ ) ఆధ్వర్యంలో వనస్థలిపురంలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అందరికీ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి, చేనేత కార్మిక వ్యవస్థను రక్షించుకోవాలన్నారు. సోమవారం ప్రతిఒక్కరు చేనేత దుస్తులు ధరించాలని, మోదీ కార్యక్రమాన్ని చూడాలని కోరారు. చేనేతకు సంబంధించిన అనేక పథకాలు ప్రధాని ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. పోచంపల్లి చీరలు అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయిల్ పంపుతున్నారని.. దీనిపై 15 శాతం నూలు సబ్సిడీ అందిస్తుంటంతో చేనేత కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల సంఘానికి ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ప్రభుత్వం మొండికేసిందనీ, 4 నెలల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చాక చేనేత సంఘాలకి ఎన్నికలు నిర్వహిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.