Kishan Reddy on PM Modi Telangana Tour : ప్రధాని మోదీ.. అక్టోబర్ 3న నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారు: కిషన్‌రెడ్డి - బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
Published : Sep 25, 2023, 8:53 PM IST
Kishan Reddy on PM Modi Telangana Tour :తొమ్మిదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి లేని పాలన కొనసాగించారని కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) అన్నారు. నరేంద్ర మోదీ అక్టోబరు ఒకటో తారీఖున హైదరాబాద్‌కు రానున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలో మోదీ పర్యటించనున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల పీఎం మోదీ ప్రారంభించనున్నారని తెలిపారు. అక్టోబరు 3వ తేదీన ప్రధాని నిజామాబాద్ బహిరంగ సభలో పాల్గొంటారని వెల్లడించారు. ప్రధాని జన్మదినం సందర్భంగా అమీర్‌పేటలోని ఎంసీహెచ్ గురుగోవింద్ స్టేడియంలో రక్తదాన శిబిరాన్ని కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
PM Modi Telangana Tour 2023 Update :ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి.. రాష్ట్రంలో మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17 నుంచి అక్టోబరు 2న గాంధీ జయంతి వరకు బీజేపీ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు తమవంతు కృషి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ గత తొమ్మిదిన్నరేళ్లలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని స్పష్టం చేశారు. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవడం, ఉచితంగా వ్యాక్సిన్, ఆర్టికల్ 370 రద్దు, నూతన విద్యా విధానం, జీఎస్టీ, ఉచిత బియ్యం పంపిణీ, జీఎస్టీ, ఉగ్రవాద నిర్మూళన, ప్రపంచ దేశాల్లో భారత ప్రతిష్ఠను పెంచడం, జీ20 లాంటివి సహా.. ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా నీతి నిజాయతీతో పాలన అందిస్తున్నారని వెల్లడించారు. అక్టోబరు 2న దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.