Kishan Reddy on PM Modi Telangana Tour : 'నిజామాబాద్ సభలోనే తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం' - Governor rejects MLC candidates
Published : Sep 26, 2023, 7:30 PM IST
Kishan Reddy on PM Modi Telangana Tour :నిజామాబాద్ సభతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేస్తారని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో అక్టోబరు ఒకటి నుంచి బీజేపీ ఎన్నికల ప్రచారం(BJP Election Campaign) మొదలు కానుందని తెలిపారు. నిజామాబాద్లో అక్టోబరు 3న జరిగే గిర్‌రాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ బహిరంగ సభ స్థలిని కిషన్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి(Kishan Reddy) మాట్లాడారు. నిజామాబాద్ సభతో తెలంగాణలో మోదీ ఎన్నికల శంఖారావం పూరిస్తారని చెప్పారు. తెలంగాణలో కొత్తగా రూ.6 వేల కోట్లతో చేపట్టిన 800 మెగావాట్ల ప్రాజెక్టును వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రధాని జాతికి అంకితం చేస్తారన్నారు.
Kishan Reddy Fires on BRS Government :ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను తిరస్కరించి గవర్నర్(Governor Tamilisai Rejects MLC Candidates) మంచి పని చేశారన్నారు. బీఆర్ఎస్కు కొమ్ముకాసే వారికి సామాజిక సేవా కోటాలో ఎమ్మెల్సీ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేసి మోదీ తెలంగాణకు రావాలని మంత్రి కేటీఆర్(Minister KTR) అంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. చేతగాని వారికి సమాధానం చెప్పనని, సీఎంకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఎవరో అడిగిన ప్రశ్నలను తన వద్ద ప్రస్తావించటం ఏమిటని, ఇంకోసారి ఇలాంటి ప్రశ్నలు వేయవద్దంటూ మాట దాటవేశారు. సభాస్థలి పరిశీలన అనంతరం నగరంలోని బస్వాగార్డెన్లో జరిగిన పదాధికారుల సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.