Kishan Reddy Fires on KCR : 'ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారు'
Published : Sep 24, 2023, 4:10 PM IST
Kishan Reddy Fires on KCR in Hyderabad : తెలంగాణలో 9 సంవత్సరాలుగా నిరుద్యోగులకు న్యాయం జరగడం లేదని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీకి ముందుకు రాదని.. కానీ ఇచ్చిన ఉద్యోగాల భర్తీ ప్రక్రియలోనూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పూర్తిగా విఫలమైందని విమర్శించారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. లక్షలాది మంది నిరుద్యోగులు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి కోచింగ్ తీసుకుంటున్నారని తెలిపారు. హైదరాబాద్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Kishan Reddy Comments on TSPSC : అయినా ఉద్యోగాలను భర్తీ చేయకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కుట్ర చేస్తున్నారని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. నిరుద్యోగులను తెలంగాణ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. దీంతో నిరుద్యోగులు నిరాశ, నిస్పృహలతో ఉన్నారని చెప్పారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 1న తెలంగాణలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తారని తెలిపారు. బేగంపేటలో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సంస్థకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు. అనంతరం పాలమూరు నిర్వహించే బహిరంగ సభలో మోదీ పాల్గొంటారని కిషన్‌రెడ్డి వివరించారు.