తెలంగాణ

telangana

Kishan Reddy

ETV Bharat / videos

Kishan Reddy Fires on CM KCR : '30 రోజులు పోరాడితే రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడొచ్చు' - బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Oct 26, 2023, 8:02 PM IST

Kishan Reddy Fires on CM KCR :ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన డిజైన్‌ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లు కుంగిపోయి.. తెలంగాణ ప్రజల సొమ్ము లక్షా 25 వేల కోట్లు వృథాగా పోయాయని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. రానున్న రోజుల్లో ఉగ్ర వాదులకు, ఎంఐఎం పార్టీకి భైంసా కేంద్రం అయ్యే అవకాశం ఉందన్నారు. ముథోల్ నియోజకవర్గంలో అందరూ ఐక్యమత్యంగా ఉండి.. ముథోల్, భైంసాను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ముథోల్ నియోజకవర్గానికి చెందిన పలువూరు బీఆర్ఎస్​కి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్​లు బీజేపీలో చేరారు. వీరికి కాండువాలు కప్పి కిషన్​రెడ్డి బీజేపీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే ముథోల్​లో చాలా నష్టపోయామని.. పండుగల సమయంలో ముథోల్‌ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో కూడా తెలంగాణలో ఎక్కడంటే అక్కడ మద్యం దొరికే పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో ఉందన్నారు. 

Kishan Reddy Comments on BRS Government : తెలంగాణ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కిషన్​రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను, యువకులను, అన్ని వర్గాల వారిని మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఒక్కోసారి భైంసా పరిస్థితి చూస్తే.. పాకిస్థాన్‌లో ఉన్నామా అనే భయం కలుగుతోందన్నారు. 30 రోజుల పాటు అంతా కష్టపడి పనిచేస్తే రాష్ట్రంలో కుటుంబ పాలనకు చరమగీతం పాడొచ్చని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.  

ABOUT THE AUTHOR

...view details