ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి - నీతివంతమైన పాలన అందిస్తాం : కిషన్ రెడ్డి - బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఇంటర్వ్యూ
Published : Nov 11, 2023, 10:43 PM IST
Kishan Reddy Exclusive Interview With Etv Bharat : ఉచితాల పేరుతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు కావాల్సింది ఉచితాలు కాదని విద్యా, వైద్యం ఆర్థిక స్వాలంభనకావాలన్నారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం, ఉద్యోగ కల్పన చేపడుతామన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ ఎప్పటికీ ఒక్కటి కావన్నారు. గులాబీ పార్టీ, కాంగ్రెస్ నాణానికి బొమ్మ, బొరుసులాంటివి అన్నారు. కాంగ్రెస్‌తో బీఆర్‌ఎస్ అధికారం పంచుకున్న చరిత్ర ఉందన్నారు. దీపావళి తరువాత తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తామని తెలిపారు. తెలంగాణలో జనసేనతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారు. రాష్ట్రంలో ఎన్ని స్థానాల్లో కాషాయ జెండా ఎగురనుంది. ఆర్థిక సంక్షోభం నుంచి తెలంగాణను గట్టెక్కించడం ఒక్క బీజేపీతోనే సాధ్యమని.. రాష్ట్ర ప్రజలు ఆలోచించి ఒక్కసారి తమకు అవకాశం ఇవ్వాలంటున్న కిషన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.