తెలంగాణ

telangana

గిర్ నేషనల్ పార్క్​లో సింహాలు

ETV Bharat / videos

మృగరాజుల రాజసం.. సింహాలు నీళ్లు తాగుతున్న సీన్ అదుర్స్ - దర్జాగా మోకాళ్లపై కూర్చొని నీళ్లు తాగుతున్న సింహం

By

Published : Mar 7, 2023, 6:53 PM IST

అడవికి రాజుగా సింహాన్ని పిలుస్తారు. అలాంటి మృగరాజు జూలు విదిల్చి అడవిలో నడుస్తుంటే ఎవరైనా భయపడాల్సిందే. గుజరాత్​.. జునాగఢ్​లోని గిర్ అభయారణ్యంలో రెండు సింహాలు దర్జాగా మోకాళ్లపై కూర్చొని నీళ్లు తాగాయి. రెండు సింహాలు పక్కపక్కనే నీళ్లు తాగుతున్న అపురూప చిత్రాలను వైల్డ్​లైఫ్ ఫొటోగ్రాఫర్ కరీం కవదార్ తన కెమెరాలో బంధించారు. సింహాలు నెమ్మదిగా నడిచి వెళ్తున్న దృశ్యాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. నీళ్లు కుండీ దగ్గర మోకాళ్లపై కూర్చొని నీరు తాగుతున్న దృశ్యాలు అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి ఫొటోలను తీయడం ఆనందంగా ఉందని ఫొటోగ్రాఫర్ కరీం అన్నారు.  

ఆసియాటిక్‌ లయన్‌ అనే జాతి సింహాలు గిర్‌ నేషనల్‌ పార్కులోనే ఉంటాయి. ప్రపంచంలో మరెక్కడా ఈ జాతి సింహాలు ఉండవు. ఆఫ్రికా సింహాల కన్నా ఇవి కాస్త చిన్నవిగా ఉంటాయి. కొన్నాళ్ల క్రితం తుర్కీయే, ఇరాన్‌ ప్రాంతాల్లోనూ ఉండేవి. విచక్షణారహితంగా అడవులు నరికివేత, పర్యావరణ కాలుష్యం, వేట, భూతాపం వంటి కారణాలతో ఆసియాటిక్ జాతి సింహాలు రానురానూ తగ్గుతూ వచ్చాయి.  

ABOUT THE AUTHOR

...view details