ప్రమాదవశాత్తు బావిలో పడిన 11 అడుగుల కోబ్రా సురక్షితంగా బయటకు - 11 అడుగుల పాము కోర్బా జిల్లా ఛత్తీస్‌గఢ్
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లాలో బావిలో పడిన 11 అడుగుల కోబ్రాను స్నేక్ రెస్య్కూ టీమ్ కాపాడింది. బేలా గ్రామంలో ఉన్న వ్యవసాయ బావిలో ప్రమాదవశాత్తు పడిపోయింది. దీన్ని గమనించిన స్థానికులు బావిలో నీళ్లు నింపడం నిలిపివేశారు. అనంతరం ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. డీఎఫ్ఓ ఆదేశాలతో రెస్క్యూ టీమ్, ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కోబ్రాను సురక్షితంగా బయటకు తీశారు. ఆ తర్వాత పామును అటవీ ప్రాంతంలో వదిలేశారు. అయితే పాముల సంరక్షకుడు జితేంద్ర సారథి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ మొత్తంలో కోర్బా జిల్లాలోనే ఎక్కువ సంఖ్యలో కోబ్రాలు ఉన్నాయన్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST