తెలంగాణ

telangana

By

Published : Sep 12, 2022, 10:59 AM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

ETV Bharat / videos

భారీ బల్లిని మింగేందుకు కింగ్ కోబ్రా విఫలయత్నం.. చివరకు ఏమైందంటే..

కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో కింగ్ కోబ్రా హల్​చల్ చేసింది. సిర్సి సమీపంలో కింగ్ కోబ్రా.. భారీ బల్లిని మింగేందుకు విఫలయత్నం చేసింది. బల్లిని నోటకరచుకున్న సర్పం.. గంటకుపైగా దాన్ని మింగేసేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే బల్లి శరీరం పెద్దదిగా ఉండడం వల్ల చివరకు కోబ్రా దాన్ని విడిచిపెట్టేసింది. అప్పటికే బల్లి ప్రాణాలు కోల్పోయింది. ఈ దృశ్యాలను మొబైల్​లో బంధించాడు బైక్ రైడర్ అనంతమూర్తి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details