భారీ ఉడుమును మింగేసేందుకు కింగ్ కోబ్రా ప్రయత్నం - కర్ణాటకాలో ఉడుముపై కింగ్‌కోబ్రా దాడి
కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లా బెల్తంగడీలో ఓ భారీ కింగ్‌కోబ్రా 4 అడుగుల ఉడుముపై దాడి చేసింది. కోబ్రా నుంచి తప్పించుకునేందుకు ఉడుము తీవ్రంగా ప్రయత్నించింది. అయితే దాని కాటుకు కొద్ది క్షణాల్లోనే ఉడుము చనిపోయింది. అనంతరం దానిని మింగేందుకు పాము విఫల యత్నం చేసింది. తల వరకు మింగినా మిగిలిన భాగం తినలేక బయటకు కక్కేసింది. స్థానికుల ఫిర్యాదుతో అటవీశాఖ సిబ్బంది రంగంలోకి దిగారు. కోబ్రాను ఓ సంచిలో బంధించి అడవుల్లో వదిలివేశారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST