తెలంగాణ

telangana

కింగ్ కోబ్రా క్యాచింగ్ వీడియో

ETV Bharat / videos

పొలంలో 14అడుగుల కింగ్ కోబ్రా.. ఏడాదిగా వ్యవసాయం బంద్​!.. చాకచక్యంగా పట్టుకున్న స్నేక్​ క్యాచర్​ - పెద్ద కింగ్ కోబ్రా వీడియో

By

Published : Aug 13, 2023, 9:54 AM IST

King Cobra Catching Video :కర్ణాటక చిక్కమగళూరు జిల్లాలోని ఓ రైతు పొలంలో 14 అడుగుల కింగ్​ కోబ్రాను చాకచక్యంగా పట్టుకున్నాడు స్నేక్​ క్యాచర్​. అందుకు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించాడు. అనంతరం పామును స్థానిక అటవీ ప్రాంతంలో విడిచిపెట్టాడు. 

కొప్ప తాలూకాలోని హోసూర్ గ్రామానికి చెందిన రైతు చిదంబర హెబ్బార్ పొలంలో.. ఏడాదిగా ఈ 14 అడుగుల కింగ్​ కోబ్రా నివాసం ఉంటోంది. పొలాన్ని సాగు చేస్తున్న సమయంలో రైతు చిదంబరకు తరచుగా కనిపించేది ఈ కోబ్రా. దీంతో సంవత్సరం పాటు పొలంవైపే వెళ్లడం మానేశాడు ఆ రైతు. కొద్ది రోజుల క్రితం స్నేక్​ క్యాచర్​ల గురించి తెలుసుకుని.. హరీంద్ర అనే వ్యక్తికి సమాచారం అందించాడు. అనంతరం రైతు చిందంబర పొలానికి చేరుకున్న స్నేక్​ క్యాచర్​ హరీంద్ర.. చాకచక్యంగా దాన్ని పట్టుకున్నాడు. అందుకోసం భారీ గుంత తవ్వాడు. అనంతం పామును అడవిలో విడిచిపెట్టాడు. దీంతో పాము బాధ నుంచి రైతు విముక్తి పొందాడు. 

ABOUT THE AUTHOR

...view details