తెలంగాణ

telangana

Kids Fashion Show 2023

ETV Bharat / videos

Kids Fashion Show in Madhapur : చిచ్చర పిడుగులాంటి చిన్నారుల ఫ్యాషన్‌ షో.. ర్యాంప్​పై అబ్బురపరిచిన ప్రదర్శనలు ! - కిడ్స్ ఫ్యాషన్ షో 2023

By

Published : Aug 7, 2023, 9:22 PM IST

Kids Fashion Show in Madhapur : ముద్దులొలికే చిన్నారులు.. తమ బుడి బుడి నడకలతో ఔరా! అనిపించారు. మోడల్స్‌ను మరిపించేలా ర్యాంప్‌పై హంస నడకలతో అదరహో అనిపించారు. చూడముచ్చటైన వస్త్రధారణతో చూపరులను కట్టిపడేశారు. ఇండియన్‌ ఫ్యాషన్‌ వీక్‌లో భాగంగా.. హైదరాబాద్​ మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ హోటల్‌లో ఏర్పాటు చేసిన కిడ్స్‌ ఫ్యాషన్‌ షో ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా చిన్నారులు సంప్రదాయ పంచెకట్టు, రంగు రంగుల దుస్తుల్లో ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పాస్ట్‌బీట్‌ పాటల సంగీతానికి సై సై అంటూ చిందులేచారు. ఎలాంటి బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తూ ఆడియెన్స్​ను కట్టిపడేశారు. ఒకవైపు అమాయకపు చూపులు.. మరోవైపు హుషారుగా అడుగులు చిందిస్తూ వీక్షకులకు కనువిందు చేశారు. చిచ్చర పిడుగులాంటి చిన్నారులు ప్రదర్శించిన ఫ్యాషన్‌ షో, డ్యాన్స్‌లకు ప్రేక్షకులు చప్పట్లుతో హోటల్​ ప్రాంగణమంతా హోరెత్తింది. 8 ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన పలువురు డిజైనర్లు రూపొందించిన దుస్తులను చిన్నారులు షోలో ప్రదర్శించి మెప్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు చేస్తున్న ఫ్యాషన్‌ షోను చూస్తూ మురిసిపోయారు. చిన్నపిల్లలతో ఇలాంటి ఓ షో నిర్వహించడం చూడముచ్చటగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details