తెలంగాణ

telangana

Kidnapping Of A Boy In Jagtial

ETV Bharat / videos

జగిత్యాలలో బాలుడి అపహరణకు యత్నం - నిందితుడికి దేహశుద్ధి - జగిత్యాల జిల్లా క్రైమ్​ వార్తలు

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 6:13 PM IST

Kidnapping Of A Boy In Jagtial : ప్రస్తుత కాలంలో బాలురు బాలికలు అనే తేడా లేకుండా అపహరణ గురవుతున్నా ఘటనలు అక్కడక్కడ చోటు చేసుకుంటున్నాయి. తల్లిదండ్రులు ఏమరపాటుతో ఉన్నప్పుడు కానీ పిల్లలు ఆడుకుంటుడగా కానీ అదే అదనుగా భావించి కిడ్నాపర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా జావిద్‌ అనే వ్యక్తి బాలుడి అపహరణ చేస్తుండగా స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన జగిత్యాల పట్టణంలోని వాణి నగర్​లో చోటు చేసుకుంది. కాలనీ వాసుల కథనం ప్రకారం అనుమానాస్పదంగా తిరుగుతూ మద్యం మత్తులో బాలున్ని అపహరించేందుకు యత్నించాడు. 

Police Registered Case Against Kidnapper : బాలుడిని అపహరిస్తుండగా స్థానికులు గుర్తించి దేహశుద్ధి చేశారు. బాలుడుని క్షేమంగా ఇంటికి చేర్చారు. అనంతరం స్థానికులు జగిత్యాల పట్టణ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని, అతన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఠాణాకు తరలించారు. పోలీసులు జావిద్‌ గురించి ఆరా తీస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details