Khairatabad Ganesh 2023 : శ్రీదశ మహావిద్యాగణపతిగా ఖైరతాబాద్ గణేశుడి దర్శనం.. మొదలైన భక్తుల కోలాహలం..
Published : Sep 17, 2023, 7:17 PM IST
Khairatabad Ganesh News :ఖైరతాబాద్ గణేశుడి వద్ద భక్తుల సందడి మొదలైంది. వినాయక చవితికి ఒక రోజు ముందు నుంచే.. ఖైరతాబాద్ గణేశుడి దర్శనానికి భక్తులు తరలివస్తున్నారు. ఈ ఏడాది శ్రీ దశ మహా విద్యాగణపతిగా.. ఖైరతాబాద్ గణేశుడు(Khairatabad Ganesh) భక్తులకు దర్శనమిస్తున్నారు. 11 రోజులపాటు ఘనంగా జరిగే ఉత్సవాల్లో.. రేపు ఉదయం 9.30 గంటలకు తొలిపూజ ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు గవర్నర్ తమిళిసై ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకోనున్నారు.
Vinayaka Chavithi Celebrations in Hyderabad :మట్టితో చేసిన ఈ మహా గణపతి విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఏర్పాటుచేశారు. ఏటా మాదిరిగానే ప్రధాన మండపం రెండు వైపులా ఇతర విగ్రహాలను ఏర్పాటు చేశారు. కుడివైపు శ్రీ పంచముఖ లక్ష్మీ నారసింహస్వామి, ఎడమవైపు శ్రీ వీరభద్ర స్వామి విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తున రూపుదిద్దుకున్నాయి. మరోవైపు గణేశుడి పరిసరాల్లో భక్తలకు ఇబ్బందులు ఏర్పడకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి.. పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.