రూ.100లకే కిలో చికెన్ - అభిమాన పార్టీ అభ్యర్థులు గెలిచినందుకు అదిరిపోయే ఆఫర్ - బీజేపీ గెలిచిందని వంద రూపాయలకే కిలో చికెన్
Published : Dec 10, 2023, 2:10 PM IST
KG Chicken For100Rs Offer in Nizamabad : నిజామాబాద్ జిల్లాలో నాన్వెజ్ ప్రియులకు రెండు దుకాణాలు అదిరిపోయే ఆఫర్ ప్రకటించాయి. వంద రూపాయలకే కిలో చికెన్ అంటూ ఆఫర్ పెట్టాయి. ఇంతకీ ఆ ఆఫర్ ప్రకటన కోసమో, వ్యాపారాన్ని వృద్ది చేసుకోవడానికో కాదు. వారు అభిమానించే పార్టీ నేతలు ఎన్నికల్లో గెలిచారని ఈ ఆఫర్ను ఆ రెండు దుకాణాలు పెట్టాయి. ఒకరు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆఫర్ పెడితే, మరొకరు బీజేపీ అభ్యర్థి గెలిచారని ఈ నిర్ణయం తీసుకున్నాయి.
ఇవాళ ఆదివారం కావడం, మరోవైపు ఈ ఆఫర్లు ఊరిస్తుండటంతో నిజామాబాద్ నగరంలో చికెన్ కోసం జనం బారులు తీరారు. అక్కడికి వచ్చిన జనం ఇంత తక్కువ ధరకు కిలో చికెన్ వస్తుండటంతో తెగ సంబురపడిపోతున్నారు. కిలోలకు కిలోలు చికెన్ కొనుక్కుని వెళ్తున్నారు. కోళ్ల ధరలు తక్కువగా ఉన్నా దాన్ని రెట్టింపు చేసి అమ్మకాలు చేస్తున్నారని అందువల్ల అందరూ తినడం తగ్గిస్తున్నారని తెలిపారు. తమ అభిమాన పార్టీల గెలుపువల్ల వాస్తవంగా ఉన్న ధరలకంటే తక్కువ ధరకు అమ్ముతున్నారని కోనుగోలుదారులు అంటున్నారు.