తెలంగాణ

telangana

man-tried-to-take-photo-wild-elephant-attack

ETV Bharat / videos

ఫొటో తీసేందుకు యత్నం.. సందర్శకుడిపైకి దూసుకొచ్చిన ఏనుగు - ఏనుగు దాడి వీడియో

By

Published : Jun 8, 2023, 8:59 AM IST

కేరళ వయనాడ్​లోని ముతంగ వణ్యప్రాణుల అభయారణ్యంలో సందర్శకుడిపై ఓ ఏనుగు దాడికి యత్నించింది. ఏనుగును ఫొటో తీసేందుకు యువకుడు యత్నించగా.. వణ్యప్రాణి ఒక్కసారిగా అతడిపైకి దూసుకొచ్చింది. దీంతో తన ప్రాణాలు కాపాడుకునేందుకు యువకుడు పరిగెత్తి రోడ్డుపైకి చేరుకున్నాడు. రోడ్డుపై మరికొందరు ఉండటం చూసి.. ఏనుగు వెనుదిరిగింది. ఈ ఘటన సోమవారం జరిగింది. ఈ దృశ్యాలను అభయారణ్యానికి వచ్చిన కొందరు ఫోన్లలో బంధించారు.

'అతడు ఏనుగును దగ్గరి నుంచి ఫొటో తీయాలని అనుకున్నట్టున్నాడు. ఏనుగు కనిపించగానే.. దాని దగ్గరికి వెళ్లాడు. ఫొటో తీసేందుకు ప్రయత్నించాడు. కానీ, భయపడ్డ ఏనుగు.. వేగంగా పరిగెత్తుకుంటూ అతడిపైకి దూసుకొచ్చింది. రోడ్డుపై ఉన్న సందర్శకులు అరవడం, వాహనాలతో శబ్దాలు చేయడం వల్ల ఏనుగు వెనక్కి తగ్గింది' అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
యువకుడు తమిళనాడుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.4వేలు జరిమానా సైతం వసూలు చేశారు. అటవీ శాఖ అధికారులు యువకుడి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. 

ABOUT THE AUTHOR

...view details