తెలంగాణ

telangana

జాతరలో ఎస్​ఐ డ్యాన్స్

ETV Bharat / videos

డ్యూటీలో ఉండగా ఎస్​ఐ జోర్దార్ డ్యాన్స్.. సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు - పూపార మరియమ్మన్ జాతర

By

Published : Apr 6, 2023, 4:12 PM IST

డ్యూటీలో ఉండగా గుడి దగ్గర డ్యాన్స్​ చేసిన ఓ సబ్​ ఇన్​స్పెక్టర్​పై సస్పెన్షన్ వేటు పడింది. కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 
బుధవారం శాంతన్​పార పోలీస్​ స్టేషన్​ పరిధిలో.. పూపార మరియమ్మన్​ దేవత జాతర జరిగింది. జాతరకు దాదాపు వంద మందికి పైగా భక్తులు హాజరయ్యారు. స్థానిక ఎస్​ఐ కేపీ శాజీ తన బృందంతో కలిసి జాతర బందోబస్తులో విధులు నిర్వర్తిస్తున్నారు. అదే సమయంలో భక్తులు దేవత ముందు.. 'మరియమ్మ కాలియమ్మ' అనే తమిళ పాటను ప్లే చేశారు. ఆ పాట విన్న ఎస్​ఐ కేపీ శాజా.. దేవత ముందు డాన్స్​ చేశారు. ఆయన నృత్యాన్ని మిగతా పోలీసులతో పాటు భక్తులు తొలుత ఆసక్తిగా తిలకించారు. కాసేపటికి స్థానికులు వచ్చి ఎస్​ఐని అడ్డుకున్నారు. అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు. డ్యూటీలో ఉండగా ఇలా గుడి ముందు సబ్​ ఇన్​స్పెక్టర్ డ్యాన్స్ చేసిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారు ఈ ఘటనను తీవ్రంగా పరిగణించారు. సబ్​ ఇన్​స్పెక్టర్​పై సస్పెండ్ చేశారు. ఎస్​ డ్యాన్స్​ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

తరగతి గదిలో మహిళ టీచర్ల స్టెప్పులు..
తరగతి గదిలో ప్రభుత్వ పాఠశాల మహిళా టీచర్లు డ్యాన్స్ చేశారు. విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన వారు.. బాలీవుడ్​ పాటలకు స్టెప్పులేశారు. విషయం తెలుసుకున్న విద్యాశాఖ అధికారులు.. పాఠశాలలో బాధ్యతరాహితంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను సస్పెండ్​ చేశారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఆగ్రాలో జరిగిందీ ఘటన. వీడియో కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details