తెలంగాణ

telangana

కేదార్​నాథ్​ ఆలయ గర్భగుడిలో డబ్బు విసురుతున్న మహిళ

ETV Bharat / videos

జ్యోతిర్లింగంపై కరెన్సీ నోట్లు విసిరిన మహిళ.. ఆలయ కమిటీ ఆగ్రహం - kedarnath jyotirlinga

By

Published : Jun 19, 2023, 4:53 PM IST

పవిత్రమైన కేదార్​నాథ్​ ఆలయ గర్భగుడిలో జ్యోతిర్లింగంపై ఓ మహిళ నోట్లు విసరడం వివాదాస్పదమైంది. మహిళ నోట్లు విసురుతున్న సమయంలో ఆమె పక్కన కొందరు భక్తులు కూడా ఉన్నారు. అయితే వారు ఆ మహిళను, అడ్డుకోకపోగా.. మంత్రాలు పఠించడం చర్చనీయాంశంగా మారింది. గర్భగుడిలో మహిళ ప్రవర్తించిన తీరుపై పలువురు మండిపడుతున్నారు. కాగా ఆ మహిళ ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కోట్ల మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన ఆ మహిళపై విచారణ జరిపించాలని ఆలయ కమిటీ అధికారులు.. రుద్రప్రయాగ్​ జిల్లా మెజిస్ట్రేట్​, సుపరింటెండెంట్  ఆఫ్​ పోలీస్​ను కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

మరోవైపు, కేదార్‌నాథ్‌ ఆలయానికి బంగారు తాపడం చేయించే ప్రక్రియలో అవకతవకలు జరిగినట్టు పలు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ప్రచారాన్ని ఆలయ కమిటీ కొట్టిపారేసింది. ఆలయ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకే కొందరు వ్యక్తులు ప్రత్యేకంగా పనికట్టుకొని ఇలాంటి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని కమిటీ ఛైర్మన్ మండిపడ్డారు. ఆలయ తాపడం పనులు అన్నీ కూడా దాతల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details