Manoj kumar Clarity on Shamirpet Incident : కాల్పులు జరిపింది నేను కాదు: కార్తీకదీపం ఫేమ్ మనోజ్ కుమార్ - Karthikdeepam serial actor Manoj Kumar
Karthika Deepam Actor Manoj Kumar : మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ క్లబ్‌లోని విల్లాలో కాల్పుల కలకలం చోటుచోసుకున్న విషయం తెలిసిందే. మనోజ్ అనే వ్యక్తి తనపై కాల్పులు జరిపినట్లు సిద్దార్థ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఎయిర్‌గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు నిర్ధారించారు. కుటుంబ సమస్యల కారణంగా ఈ కాల్పులు జరిగాయని పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితుడు మనోజ్.. పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ నటుడు మనోజ్ కుమార్ స్పందించారు. కొన్ని మీడియా సంస్థలు.. కాల్పులు జరిపింది తానే అని ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. తాను బెంగళూరులో ఉన్నానని చెప్పారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు మనోజ్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు.