తెలంగాణ

telangana

Karnataka Minister Bosuraju Interview

ETV Bharat / videos

Karnataka Minister Bosuraju Interview : 'అమలు చేయదగిన అంశాలతోనే టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో' - తెలంగాణ ఎన్నికలపై బోసురాజు ఇంటర్వ్యూ

By

Published : Jul 1, 2023, 5:17 PM IST

Karnataka State Minor Irrigation Minister Bosuraju Interview : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలమైన వాతావరణం ఉన్నందున పార్టీ నాయకుల్లో ఉన్న చిన్న పాటి రాజకీయ విభేదాలు అడ్డంకిగా మారవని కర్ణాటక చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు స్పష్టం చేశారు. కర్ణాటకలో మాదిరి.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపు అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకుని పారదర్శకంగా.. సామాజిక వర్గాల వారిగా ఉంటుందని.. ఎవరికీ అన్యాయం జరగకుండా స్క్రీనింగ్ కమిటీ చూస్తుందని ఆయన వెల్లడించారు.

ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకుని.. అమలు చేయదగిన అంశాలనే ప్రజల్లోకి తీసుకెళ్తామని బోసురాజు తెలిపారు. వాటినే మేనిఫెస్టోలో పెడితే.. అధికార బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్లుగా తెలంగాణలో ఏఐసీసీ కార్యదర్శిగా పని చేసిన అనుభవం, తెలంగాణ రాష్ట్రంపై గట్టి పట్టున్న ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజుతో మా ప్రతినిధి ప్రత్యేక ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details