తెలంగాణ

telangana

Karnataka Car Accident

ETV Bharat / videos

కాలువలోకి దూసుకెళ్లిన కారు- ఐదుగురు మృతి, అంతా బంధువులే! - కాలువలోకి దూసుకుపోయిన కారు వీడియో

By ETV Bharat Telugu Team

Published : Nov 8, 2023, 12:36 PM IST

Karnataka Car Accident : అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ ఘటనలో నీట మునిగి ఐదుగురు మరణించారు. మృతులంతా బంధువులేనని పోలీసులు తెలిపారు. కర్ణాటకలోని మండ్య జిల్లాలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైసూరు నుంచి తుమకూరు వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి విశ్వేశ్వరాయ కాలువలోకి దూసుకుపోయింది. గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమచారం అందించారు. హుటాహుటిన పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. 

లైఫ్​ బోట్లతో కాలువలోకి రెస్క్యూ ఆపరేషన్​ను సహాయక బృందాలు నిర్వహించాయి. అప్పటికే కారులోని ఐదుగురు కూడా చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా బంధువులే అని చెప్పారు. వీరంతా మైసూరులో ఓ వేడుకకు హాజరై.. తిరుగు ప్రయాణమయ్యారని పోలీసులు వెల్లడించారు. నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు.

వంతెనపై నుంచి..
మహారాష్ట్రలోని రాయ్​గఢ్​ జిల్లాలో వంతెనపై నుంచి అదుపుతప్పి ట్రాక్​పై వెళ్తున్న గూడ్స్ ట్రైన్​పై పడిపోయింది ఓ కారు. రైలును ఢీకొట్టడం వల్ల కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ వీడియో చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details