తెలంగాణ

telangana

గంగా నదిలో కొట్టుకుపోయిన కవాడి భక్తుడు.. కాపాడిన పోలీసులు

ETV Bharat / videos

గంగా నదిలో కొట్టుకుపోయిన కావడి భక్తుడు.. పోలీసులు రిస్క్ చేసి మరీ.. - కవాడ్ యాత్ర 2023 జల్

By

Published : Jul 15, 2023, 12:24 PM IST

గంగానదిలో ఓ కావడి యాత్రికుడు కొట్టుకుపోయాడు. స్నానం చేస్తున్న సమయంలో.. నీటి ఉద్ధృతి పెరగడం వల్ల ఈ ఘటన జరిగింది. కొద్ది దూరం వెళ్లిన అనంతరం.. గంగానది మధ్యలోనే బాధితుడు చిక్కుకుపోయాడు. కాపాడమని గట్టిగా అరుస్తూ.. పోలీసుల సాయం కోరాడు. బాధితుడ్ని గమనించిన పోలీసులు వెంటనే స్పందించారు. రెస్కూ ఆపరేషన్​ చేసి యువకుడి ప్రాణాలను కాపాడారు. బాధితుడ్ని నదిలో నుంచి సురక్షితంగా బయటకు తెచ్చారు. ఉత్తరాఖండ్​లో శుక్రవారం ఈ ఘటన జరిగింది.

రిషికేశ్​లోని ఉన్న త్రివేణి ఘాట్​ వద్ద బాధితుడు స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడి పేరు లవ్లేశ్ అని, అతడు ఉత్తర్​ప్రదేశ్​లోని బాందా ప్రాంతానికి చెందిన వ్యక్తి అని వారు వెల్లడించారు. భక్తుడ్ని కాపాడేందుకు సహకరించిన చైతన్య త్యాగి, హరీశ్ గుసేన్, వినోద్ సెమ్వాల్​ను అధికారులు ప్రశంసించారు. ప్రతి ఏటా శివభక్తులు ఈ కవాడి యాత్ర నిర్వహిస్తారు. అనంతరం గంగా నదిలో స్నానాలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details