కోటి మంది కలిసి ఒకేసారి గానం రికార్డు సృష్టించిన కన్నడిగులు - కన్నడ గీతాలను ఆలపించిన సీఎం బొమ్మై
కన్నడ రాజ్యోత్సవాలను వినూత్నంగా ఆచరించేందుకు కన్నడ సాంస్కృతిక శాఖ చేపట్టిన 'కోటి కంఠ గాయన' కార్యక్రమం విజయవంతమైంది. దేశంలోని 26 రాష్ట్రాలు 45 దేశాలలో 1.25 కోట్ల మంది కర్ణాటకవాసులు ఏకకాలంలో కన్నడ గీతాలను ఆలపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. విధానసౌధలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మంత్రులు పాల్గొన్నారు. పాట పాడేందుకు అనువుగా ప్రతి ఒక్కరికీ గీతాలను ముద్రించిన కరపత్రాలు అందించారు.
Last Updated : Feb 3, 2023, 8:30 PM IST